తెలంగాణ ప్రాంతంలో రుచులను ఆస్వాదించే పద్ధతి వేరుగా ఉంటుంది. పప్పు, పచ్చడి, కూరా ఇన్ని రకాలున్నాచారో, పచ్చిపులుసో లేకపోతే వెలితిగా భావిస్తారు. వేపుళ్ల కన్నా వేడివేడిగా రసం ఉంటే చాలంటారు. పొడిపొడి కూరలకన్నా కలివిడిగా కలుపుకొని హడావుడిగా లాగించే పులుసులకే మొగ్గు చూపుతారు. అందుకే బెండకాయతో చల్లపులుసు, ఆన్యపకాయతో చింతకాయ పప్పుచారు, బుడమకా యతో పప్పుకట్టు ఇలా పాకపర్వంలో ఇష్ట‘రసాలు’ ఒలికి స్తారు. కూరగాయలేం లేకపోయినా శనగపిండి బిళ్లలతో కమ్మటి పులుసు పెడతారు. చికెన్ పులుసులోని చిక్కదనంతో, మటన్ పులుసులోని ఘాటుదనంతో, కొంచెం కారంగా, కొంచెం కమ్మగా ఉండే బిళ్లల పులుసు తెలంగాణవాసులకు ఎంతో ఇష్టం.