గోల్నాక, డిసెంబర్ 6: చలాన్లు కట్టకుండా తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించారు. సోమవారం సాయంత్రం కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు అంబర్పేట అలీకేఫ్ చౌరస్తా వద్ద తనిఖీలు చేపట్టారు. హోండా ఫ్యాషన్బైక్ (AP23M 9895) వాహనాన్ని ఆపి చెక్ చేశారు. పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. ఆ బైక్పై ఏకంగా 179చలాన్లు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించారు. మొత్తం చలాన్ల విలువ రూ.42 వేలు. చలాన్లు కట్టకుండా తిరుగుతున్న యజయాని ఆ వాహనాన్ని వదిలి పరారయ్యాడు. ట్రాఫిక్ పోలీసులు ఆ బైక్ను సీజ్ చేశారు.