బీహార్, జార్ఖండ్, యూపీలో పేదలు అధికం

- అతి తక్కువ పేదలు ఉన్న రాష్ర్టాల్లో కేరళ టాప్
- నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో అత్యధికంగా పేదరికం ఉన్న రాష్ర్టాల జాబితాలో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ మేరకు బహుముఖ పేదరిక సూచీ(ఎంపీఐ) వివరాలను తాజాగా విడుదల చేసింది. ఈ సూచీ ప్రకారం బీహార్ జనాభాలో 51.91 శాతం మంది పేదలు ఉన్నారు. జార్ఖండ్, యూపీల్లో ఇది వరుసగా 42.16, 37.79 శాతంగా ఉంది. ఇక 36.65 శాతం మంది పేదలతో మధ్యప్రదేశ్ నాలుగో స్థానంలో, మేఘాలయ(32.67) ఐదో స్థానంలో ఉంది. కేరళ(0.71%), గోవా(3.76%), సిక్కిం (3.82%), తమిళనాడు(4.89%), ఢిల్లీ(4.79%), పంజాబ్ (5.59%)ల్లో పేదల సంఖ్య తక్కువగా ఉందని నీతి ఆయోగ్ పేర్కొన్నది. తెలుగు రాష్ర్టాలైన తెలంగాణలో 13.74%, ఆంధ్రపదేశ్‌లో 12.31% మంది పేదలు ఉన్నారని వెల్లడించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Niti Aayog Report
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

