Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంటున్న నేపథ్యంలో గేమ్ ఆసక్తికరమైన మలుపు తీసుకుంది. ఆదివారం జరిగిన ఎపిసోడ్లో ప్రముఖ కంటెస్టెంట్ రీతూ చౌదరి ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో ఒక్కసారిగా భావోద్వేగాలు ఉప్పొంగాయి. పోటీలో బలంగా ఆడిన రీతూ, టాప్ కంటెస్టెంట్స్‌లో నిలుస్తుందని చాలా మంది భావించిన సమయంలో ఇలా ఎలిమినేట్ కావడం అభిమానులను కూడా షాక్‌కు గురిచేసింది. హౌస్ నుంచి బయటకు రావడానికి ముందు, రీతూ తన టాప్–7 లిస్ట్ గురించి అభిప్రాయాన్ని వెల్లడించింది.
తొలి స్థానంలో డీమాన్ పవన్ – “అతను ఫస్ట్ ప్లేస్‌కి అర్హుడు” అని రీతూ చెప్పేసింది. రెండు, మూడు, నాలుగు స్థానాలలో ఇమ్ము, కళ్యాణ్, తనూజలలో ఎవరైన పంచుకోండని చెప్పింది. ఆరో స్థానంలో సుమన్ శెట్టి, ఏడో స్థానంలో భరణి అని స్పష్టం చేసింది. అయితే ఎవిక్షన్ అనౌన్స్ చేసిన క్షణం నుంచి రీతూ తన భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోయింది.బిగ్ బాస్ ఎందుకు నన్ను ఎలిమినేట్ చేశారు… ఇంకా ఉండాలని ఉంది… ఎందుకు పంపిస్తున్నారు?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ బోరున విలపించింది.
కొంతసేపటి తర్వాత ఆమె తేరుకుని,“లవ్ యూ బిగ్ బాస్… ఇన్ని రోజులు నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్” అంటూ కూల్ అయ్యింది.రీతూ బయటకు వెళ్లడం పవన్, తనూజలను చాలా ఎమోషనల్ అయ్యేలా చేసింది.. ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. హౌస్ మొత్తం ఒక్కసారిగా భావోద్వేగాలతో నిండిపోయింది.
ఆదివారం ఎపిసోడ్లో గ్రీన్ షర్ట్‌లో మెరిసిన నాగార్జున లుక్కు మ్యాచ్‌గా సంజన, రీతూ, తనూజ కూడా గ్రీన్ డ్రెస్సుల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. సీజన్ చివరి దశలోకి అడుగుపెట్టడంతో రాబోయే ఎపిసోడ్లు మరింత రసవత్తరంగా మారనున్నాయి. రీతూ ఎలిమినేషన్ తర్వాత హౌస్‌లోని సంబంధాలు, గేమ్‌ప్లే, నామినేషన్ స్ట్రాటజీలు ఏ విధంగా మారుతాయో చూడాలి.ఇక ఈ సీజన్లో బిగ్ బాస్ విన్నర్‌గా తనూజ లేదంటే కళ్యాణ్‌లలో ఎవరో ఒకరు విన్నర్ అవుతారని ముచ్చటించుకుంటున్నారు. కాగా, కళ్యాణ్ ఇప్పటికే టికెట్ టూ ఫినాలే దక్కించుకున్న విషయం తెలిసిందే.