Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ ఎపిసోడ్ ముగిసింది. నాలుగో వారం హౌస్ నుంచి కామనర్ హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పటివరకు శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియ శెట్టి ఎలిమినేట్ కాగా, తాజాగా హరీష్‌తో కలిసి మొత్తం ముగ్గురు కామనర్లు హౌస్ నుంచి బయటకి వచ్చారు. ఈ వారం నామినేషన్లో ఆరుగురు సభ్యులు ఉన్నారు . ఫ్లోరా సైని, రీతూ చౌదరి, సంజన, శ్రీజ, దివ్య, హరీష్ ఉండగా, శనివారం ఎపిసోడ్లో నాగార్జున రీతూని సేవ్ చేయగా, ఆదివారం ఎపిసోడ్లో ఫ్లోరా, సంజన, శ్రీజ సేఫ్ అయ్యారు. చివరగా దివ్య – హరీష్ మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరిగింది.
నాగ్ ఇచ్చిన స్పెషల్ టాస్క్‌లో ఇద్దరూ యాక్టివిటీ రూమ్‌లోకి వెళ్లి, స్క్వేర్ బాక్స్‌లు బద్దలుకొట్టారు. అందులో ‘సేఫ్’ అని వచ్చిన దివ్య హౌస్‌లో కొనసాగగా , ‘అన్‌సేఫ్’ అని వచ్చిన హరీష్ ఎలిమినేట్ అయ్యాడు. స్టేజ్‌పై నాగార్జున హరీష్‌కు ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చారు . “హౌస్‌లో ఎవరు బ్లాక్ మాస్క్ (అసలైన వ్యక్తిత్వాన్ని దాచుకున్నవారు), ఎవరు వైట్ మాస్క్ (జెన్యూన్‌గా ఉన్నవారు)?” అని అడిగారు. దానికి హరీష్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
బ్లాక్ మాస్క్: భరణి, ఇమ్మానుయేల్, డీమాన్ పవన్.
భరణి గురించి “రేలంగి మావయ్యలా నటిస్తున్నారు” అని చెప్పాడు. ఇమ్మానుయేల్‌పై “నా మీద అరిచినప్పుడే ఆయన అసలు స్వరూపం తెలిసింది అన్నాడు. డీమాన్ పవన్‌పై “తనలో సత్తా ఉంది, మాస్క్ తీసేసి ఆడితే కింగ్ అవుతాడు” అని అభిప్రాయం తెలిపాడు.
వైట్ మాస్క్: శ్రీజ, కళ్యాణ్, తనూజ.
శ్రీజ గురించి మాట్లాడుతూ.. ఆమెకి “కొంచెం తొందరెక్కువ కానీ బుల్లెట్లా పాయింట్స్ పెడుతుంది” అన్నాడు. కళ్యాణ్‌కి “రిలేషన్స్ నుంచి బయటకి వస్తే గేమ్‌లో ఇంకా బాగా ఆడగలరు” అని సలహా ఇచ్చాడు. తనూజ గురించి చెబుతూ “తనలో నన్ను నేను చూస్తాను, నిజాయితీగా ఉంటుంది” అని చెప్పాడు. ఆ తర్వాత తనూజ గురించి మాట్లాడుతూ, “గత మూడు రోజులుగా హరీష్ అందరితో బావున్నారు. నన్ను ఫ్లర్ట్ చేశారు కూడా!” అని చెప్పడంతో నాగార్జున పంచ్ వేశారు – “కళ్యాణ్‌కి నిన్ను చూసుకోవాలని చెప్పాల్సిన అవసరం లేదు కదమ్మా.. ఆయన చూసుకుంటాడుగా!” అని వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు.
ఇలా హరీష్ బిగ్ బాస్ హౌస్‌కు గుడ్‌బై చెప్పాడు. బయటకెళ్లే ముందు తన గేమ్ మీద సంతృప్తి వ్యక్తం చేస్తూ, “నేను నా విధంగా ఆడాను, ఎటువంటి పశ్చాత్తాపం లేదు” అన్నాడు. మరోవైపు దివ్య తనని సేవ్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఎమోషనల్ అయ్యింది. మొత్తానికి నాలుగో వారం ఎపిసోడ్ ఎమోషన్స్, టాస్క్‌లు, పంచ్‌లతో ప్రేక్షకులను అలరించింది.