పాట్నా: బీహార్‌లో ఫేమస్ ట్యూటర్ ఖాన్ సార్(Khan Sir)కు భారీ ఊరట లభించింది. కోచింగ్ సెంటర్ ఫైరింగ్ కేసులో అరెస్టు వారెంట్‌పై పాట్నా కోర్టు స్టే ఇచ్చింది. కోచింగ్ సెంటర్ వద్ద ఘర్షణ జరిగిన సమయంలో ఆందోళనకారులపై సెక్యూర్టీ గార్డులతో ఫైరింగ్‌కు పాల్పడినట్లు ఖాన్ సార్‌పై ఆరోపణలు ఉన్నాయి. పాట్నాలో ఉన్న ఖాన్ సార్ కోచింగ్ సెంటర్‌తో పాటు ఇతర కోచింగ్ సెంటర్ల మధ్య ఇటీవల తరుచూ వివాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. మరో వైపు బీహార్‌కు చెందిన అగ్నిమాపక శాఖ ఖాన్ సార్‌కు నోటీసులు జారీ చేసింది. కోచింగ్ సెంటర్లో ఫైర్ సేఫ్టీ లేదని, నిర్మాణంలో ఉల్లంఘనలు జరిగినట్లు అగ్నిమాపక శాఖ పేర్కొన్నది.
ఖాన్ గ్లోబల్ స్టడీస్ కోచింగ్ సెంటర్ బయట ఫైరింగ్ జరిగిన ఘటనలో ఖాన్ సార్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు లాయర్ అర్వింద్ కుమార్ మాహుర్ తెలిపారు. జడ్జీకి అన్ని ఆధారాలను అందజేశామని, ఫైరింగ్ ఘటనతో ఖాన్ సార్‌కు సంబంధం లేదని న్యాయవాది అర్వింద్ అన్నారు. అయితే ఖాన్ గ్లోబల్ స్టడీస్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రత్యర్థి కోచింగ్ సెంటర్‌కు చెందిన డైరెక్టర్‌ను అరెస్టు చేశారు.
జ్ఞాన బిందు కోచింగ్ సెంటర్‌కు చెందిన రౌషన్ ఆనంద్‌ను కొన్ని రోజుల క్రితం అరెస్టు చేశారు. పాట్నాలో ఉన్న కోచింగ్ సెంటర్లలో జ్ఞాన బిందు అకాడమీ కూడా చాలా ఫేమస్. అయితే కొన్నేళ్ల నుంచి ఈ రెండు సెంటర్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. బీహార్ పోలీసు రిక్రూట్మెంట్ల అంశంలో ఈ సెంటర్లలో చదువుకున్న విద్యార్థులే ఎక్కువ శాతం ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. దీంతో ఆధిపత్యం కోసం ఈ రెండు కోచింగ్ సెంటర్ల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. అనేక సార్లు ఖాన్ గ్లోబల్ స్టడీస్, జ్ఞాన బిందు కోచింగ్ సెంటర్ల మధ్య గొడవలు అయ్యాయి. అయితే ఆన్లైన్లో ఖాన్ సార్‌కు, ఆఫ్‌లైన్‌లో జ్ఞాన బిందు అకాడమీకి ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.