Michael | బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘మైఖేల్’.. ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ.. ఎక్కడ చూడొచ్చంటే?
Michael | ఈ ఏడాది హాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాల్లో ‘మైఖేల్’ ఒకటి. ప్రపంచ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసిన పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్ విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పింది. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకుంది.
Michael | ఈ ఏడాది హాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాల్లో ‘మైఖేల్’ ఒకటి. ప్రపంచ సంగీత చరిత్రలో చెరగని ముద్ర వేసిన పాప్ లెజెండ్ మైఖేల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్ విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పింది. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని అందుకుంది. మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటించడం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మైఖేల్ స్టేజ్ ప్రెజెన్స్, డ్యాన్స్ స్టైల్, హావభావాలను జాఫర్ అద్భుతంగా ప్రదర్శించాడని ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసించారు. ప్రముఖ దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా తెరకెక్కించిన ఈ చిత్రం మైఖేల్ జాక్సన్ జీవితంలోని ముఖ్య ఘట్టాలను, ఆయన సంగీత ప్రయాణాన్ని, ప్రపంచవ్యాప్తంగా ఆయన సాధించిన అపారమైన ఖ్యాతిని తెరపై ఆవిష్కరించింది.
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మ్యూజికల్ బయోపిక్ భారీ వసూళ్లను రాబట్టింది. సంగీత ప్రియులు, మైఖేల్ జాక్సన్ అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలివెళ్లడంతో సినిమా రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. పలు దేశాల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయంగా నిలిచింది. ఇక థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూనే ఉన్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా రెంటల్ విధానంలో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇంగ్లీష్‌తో పాటు హిందీ భాషలో కూడా ప్రేక్షకులు సినిమాను వీక్షించవచ్చు.
అయితే ఇది సాధారణ సబ్‌స్క్రిప్షన్‌లో భాగంగా కాకుండా రెంటల్ మోడల్లో అందుబాటులో ఉండటంతో, సినిమా చూడాలనుకునే వారు అదనపు చెల్లింపు చేయాల్సి ఉంటుంది. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులకు ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు. మరోవైపు, ఓటీటీలో రెంటల్ స్ట్రీమింగ్ ప్రారంభమైన నేపథ్యంలో త్వరలోనే ఈ చిత్రం సాధారణ సబ్స్క్రిప్షన్ స్ట్రీమింగ్‌లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

