Earthquake | ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం వణికించిన 24 గంటల్లోనే క్యూబా, ఇరాన్‌లోనూ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దక్షిణ ఇరాన్‌లోని హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అదే క్యూబాలో రిక్టర్‌స్కేలుపై 6.1 తీవ్రత నమోదైంది. గత 150 ఏండ్లలో ఆ ప్రాంతంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపంగా దీన్ని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
భూకంప కేంద్రం క్యూబా పశ్చిమ ప్రాంతంలోని మంటువా పట్టణానికి వాయవ్య దిశలో సుమారు 104 కి.మీ.దూరంలో, భూమికి 26కి.మీ.లోతులో నమోదైందని అమెరికా భూగర్భ సర్వే సంస్థ (USGS) వెల్లడించింది. సాధారణంగా టెక్టానిక్ ప్లేట్ల సరిహద్దుల్లో పెద్ద భూకంపాలు సంభవిస్తుంటాయి.. అయితే ఈసారి ప్లేట్ల అంతర్గత ప్రాంతంలోనే ఈ భూకంపం సంభించిందని శాస్త్రవేత్తలు ఆశ్యర్యం వ్యక్తం చేశారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం, భారీ ఆస్తి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. మియా
ఈ భూకంప ప్రభావం కారణంగా క్యూబాతో పాటు కరీబియన్ ప్రాంతం, మెక్సికో గల్ఫ్, అమెరికాలోని ఫ్లోరిడా సహా పలు ప్రాంతాల్లో ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మియామి, ఫోర్ట్ లాడర్డేల్, ఆర్లాండో, ఉత్తర ప్రాంతాల వరకు ప్రకంపనలు నమోదయ్యాయి. వీటి కారణంగా పలు ప్రభుత్వ కార్యాలయాలను ముందస్తు జాగ్రత్తగా ఖాళీ చేయించారు. రెండు ఎలివేటెడ్ కమ్యూటర్ రైలు సర్వీసులను తాత్కలికంగా నిలివేశారు. మెక్సికోలోని యుకటాన్ ద్వీపకల్పం, కాంకూన్, ప్లలాయా డెల్ కార్మెన్, టులుం వంటి పర్యాటక ప్రాంతాల్లోనూ భూప్రకంనలు కనిపించారు.
ఇరాన్లో 5.0 తీవ్రతతో భూకంపం
ఇరాన్లో మంగళవారం తెల్లవారుజామున 5.0 తీవ్రతతో భూంకంపం సంభవించింది. హోర్మోజ్గాన్ ప్రావిన్స్‌లోని నర్గాజ్ సమీపంలో 22కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తు్నారు.