Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఉత్కంఠభరితంగా సాగుతుంది. 25వ రోజు ఇంటిలో జరిగిన టాస్క్‌లు ప్రేక్షకులకు విపరీతమైన ఎంటర్టైన్మెంట్ను అందించాయి. పవర్ కార్డు టాస్క్‌తో డే ప్రారంభం కాగా, చివరికి కెప్టెన్సీ కంటెండర్ల ఎంపికతో ఆసక్తికర మలుపులు తిరిగింది. బిగ్ బాస్ హౌస్‌లో ఎల్లో, రెడ్, బ్లూ టీంలుగా విడిపోయిన సభ్యులు “పవర్ కార్డు టాస్క్”లో పాల్గొన్నారు. బజర్ మోగగానే ఆరెంజ్ బాల్‌ను గార్డెన్లో ఉన్న హిప్పోకి ఆహారంగా వేయడం ఈ టాస్క్‌లో ముఖ్య ఉద్దేశం. ఒక టీం సభ్యుడు బాల్ తీసుకెళ్తుంటే, ఇతర టీమ్స్ వారు అడ్డుకోవలసి ఉంటుంది. ఈ క్రమంలో టాస్క్ ఫిజికల్ మారి ప్రేక్షకులని భయబ్రాంతులకి గురి చేసింది. ఈ టాస్క్‌లో ఇమ్మాన్యుయేల్ తన పట్టుదలతో హైలైట్ అయ్యాడు. ఎంతమంది అడ్డుకున్నా, విక్రమార్కుడిలా ముందుకు సాగాడు.
ఈ క్రమంలో గేమ్ ప్రమాదకరంగా మారడంతో, సంచాలకుడు భరణి టాస్క్‌ను పాస్ చేయాల్సి వచ్చింది. అంతిమంగా ఇమ్మాన్యుయేల్ – కళ్యాణ్ రెడ్ టీం విజయం సాధించి, పవర్ కార్డును పొందారు. వీరిద్దరూ కెప్టెన్సీ కంటెండర్లుగా అర్హత సాధించారు. కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్‌లో పాల్గొనడానికి బిగ్ బాస్ ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్‌లను మూడు జంటల ఎంపికకు ఆహ్వానించాడు. వీరు ఎంపిక చేసిన జంటలు చూస్తే.. సుమన్ – తనూజ,సంజన – రాము, రీతూ చౌదరి – ఫ్లోరా షైనీ. ముందుగా తనూజ – సుమన్ పోటీలో పాల్గొన్నారు. అయితే వారు టాస్క్ రూల్స్‌ని ఉల్లంఘించడంతో, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ వారిని డిస్క్వాలిఫై చేశారు. దీనిపై తనూజ తీవ్ర భావోద్వేగానికి లోనై, వాష్‌రూమ్‌కి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమెను రీతూ చౌదరి ఓదార్చే ప్రయత్నం చేసింది.
తర్వాతి రౌండ్స్‌లో రాము – సంజన జంటలో రాము, రీతూ – ఫ్లోరా పోటీలో రీతూ విజయం సాధించారు. ఈ క్రమంలో కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, రాము, రీతూ కెప్టెన్సీ కంటెండర్లుగా ఎంపికయ్యారు. త్వరలోనే వీరిలో ఒకరు ఇంటి కెప్టెన్‌గా అవతరిస్తారు. టాస్క్‌లో జరిగిన భావోద్వేగాలు, మెలోడ్రామా, శారీరక శ్రమ అన్నీ కూడా ప్రేక్షకులను కట్టిపడేసేలా చేశాయి. అయితే గేమ్ మధ్యలో ఇమ్మాన్యుయేల్ తన కామెడీతో నవ్వించాడు. గేమ్‌లో ఎవరో నా నడుము గిల్లారు.. అది ఎవరో చెప్పాలని ఇమ్మూ అనడంతో ఆ మాటలకి సంచాలక్ భరణి సహ తనూజ, రీతూ చౌదరి అందరూ నవ్వుకున్నారు. నా నడుము అంత బావుంటే మాత్రం ఇలా గేమ్ అడ్డుపెట్టుకొని గిల్లడం నేను పర్సనల్ అబ్యూజ్‌లా ఫీల్ అవుతా.. అంటూ ఇమ్మూ అనడంతో పక్కనే ఉన్న దివ్య పగలబడి నవ్వింది.ఆ గిల్లింది ఎవరో అనే దానిపై నాకు క్లారిటీ కూడా ఉందని ఇమాన్యుయేల్ అన్నాడు.