న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మంత్రి భూపేంద్ర చౌదరీని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్గా నియమించారు. ప్రభావిత జాట్ వర్గానికి చేరువయ్యే ఉద్దేశంతో భూపేంద్ర చౌదరీని నియమించి ఉంటారని భావిస్తున్నారు. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రైతు నాయకుల్ని మెప్పించే బాధ్యతల్ని భూపేంద్రకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. హర్యానా బీజేపీ చీఫ్ ఓపీ ధంకర్, రాజస్థాన్ చీఫ్ సతీశ్ పూనియాలు కూడా జాట్ వర్గానికి చెందినవాళ్లే. యూపీ బీజేపీ చీఫ్గా ఉన్న స్వతంత్ర దేవ్ సింగ్ స్థానంలో భూపేంద్ర బాధ్యతలు స్వీకరించనున్నారు. త్రిపుర బీజేపీ అధ్యక్షుడిగా రాజీవ్ భట్టాచార్యను నియమించారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు సౌదాన్ సింగ్ను.. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఇంచార్జీగా నియమించారు.