న్యూఢిల్లీ, నవంబర్ 20: దేశంలో భూగర్భ జల నిర్వహణను మెరుగుపర్చేందుకు కేంద్రం కొత్తగా ‘భూ-నీర్’ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇటీవల నిర్వహించిన ‘ఇండియా వాటర్ వీక్-2024’లో కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ పోర్టల్‌ను ప్రారంభించినట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా భూగర్భ జలాల వినియోగంలో పారదర్శకత, సామర్థ్యం, స్థిరత్వాన్ని పెంచటం పోర్టల్ ఉద్దేశమని కేంద్రం తెలిపింది. భూగర్భ జలాల వినియోగం, వ్యాపారం, వ్యక్తిగత అనుమతులు.. తదితరమైన వాటి నిర్వహణ పోర్టల్ ద్వారా చేపడుతున్నట్టు వెల్లడించింది. అనుమతులు, చెల్లింపులు, దరఖాస్తుల స్థితి.. మొదలైనవి పోర్టల్ నుంచి పొందొచ్చునని, పాన్ ఆధారిత ఐడీ వ్యవస్థ, క్యూర్ కోడ్‌తో కూడిన ఎన్వోసీ.. మొదలైన వాటితో డిజిటల్ విధానంలో ప్రక్రియ సాగుతుందని కేంద్ర జల శక్తి అధికారి ఒకరు చెప్పారు.