యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, బిగ్‌బాస్ ఇమాన్యుయెల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భూతం ప్రేతం’. రాజేష్ ధృవ దర్శకత్వంలో బి.వెంకటేశ్వర రావు నిర్మించారు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు.
హారర్ కామెడీ చిత్రమిదని, ఐదుగురు యువకులు భూతప్రేతాలకు చిక్కితే ఏం జరిగింది? వారు ఎలా బయటపడ్డారు? అనే అంశాలు ఉత్కంఠను కలిగిస్తాయని దర్శకుడు తెలిపారు.