నాగప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఓ చెలియా’. ఎం.నాగరాజశేఖర్ రెడ్డి దర్శకుడు. త్వరలో రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. మంగళవారం ఈ చిత్ర టీజర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేశారు.
హారర్, లవ్, యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించామని, దెయ్యం కాన్సెప్ట్ ప్రేక్షకుల్ని భయపెట్టిస్తుందని మేకర్స్ తెలిపారు. యంగ్టీమ్తో ఈ చిత్రాన్ని నిర్మించామని, హారర్‌తో పాటు సినిమాలోని ప్రేమకథ యువతను ఆకట్టుకునేలా ఉంటుందని దర్శకుడు పేర్కొన్నారు.