ఇరవైఏండ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాల్లో భాగమైంది అగ్ర కథానాయిక తమన్నా. హీరోయిన్గా రాణిస్తూనే మరోవైపు ప్రత్యేక గీతాల ద్వారా యూత్‌లో క్రేజ్ దక్కించుకుంది. ఇటీవలకాలంలో ‘స్త్రీ-2’ చిత్రంలో ‘ఆజ్ కీ రాత్..’ పాట బాగా పాపులర్ అయింది. తమన్నా నటించిన ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ అనే వెబ్‌సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డ్యాన్స్‌లో తన ప్రతిభకు కారణం అల్లు అర్జున్ అని వెల్లడించింది.
“బద్రీనాథ్’ టైంలో డ్యాన్స్ విషయంలో బన్నీ బాగా ఎంకరేజ్ చేశారు. మంచి పర్ఫెక్షన్తో డ్యాన్స్ ఎలా చేయాలో అతని నుంచి నేర్చుకున్నా. ఆ సినిమా తర్వాత నాకు డ్యాన్స్ పరంగా చాలా ఆఫర్లొచ్చాయి. స్పెషల్ సాంగ్స్‌తో కూడా పాపులర్ అయ్యాను’ అని చెప్పింది తమన్నా. ఈ ఏడాది ‘ఓదెల-2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం ఈ భామ హిందీలో నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.