న్యూఢిల్లీ, నవంబర్ 12: కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ మధ్యంతర ఫలితాల విశ్లేషణ వివరాలు వెల్లడి అయ్యాయి. ప్రముఖ జర్నల్ లాన్సెట్‌లో వీటిని శుక్రవారం ప్రచురించారు. కరోనా నుంచి కొవాగ్జిన్ టీకా 77.8% రక్షణ కల్పిస్తుందని, డెల్టా వేరియంట్‌పై 65.2% సమర్థంగా పనిచేస్తుందని ఈ ట్రయల్స్‌లో తేలింది. వైరస్ సోకిన వారిలో వ్యాధి ముదరకుండా ఈ టీకా 93.4% రక్షణ కల్పిస్తుంది. గతేడాది నవంబర్ నుంచి ఈ సంవత్సరం మే నెల మధ్యలో దేశవ్యాప్తంగా 25 దవాఖానల్లో టీకాపై ట్రయల్స్ నిర్వహించారు.