రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం ‘కింగ్డమ్స జూలై 31న రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ స్పై ఏజెంట్గా కనిపించబోతున్నాడు. భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటిస్తుంది. సితార ఎంటర్టైనమెంట్స్పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించి నటి భాగ్యశ్రీ భోర్సే డబ్బింగ్ పూర్తి చేసుకుంది. ఆమె డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఒక చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
#BhagyashriBorse just wrapped up her dubbing for the #KINGDOM movie pic.twitter.com/M9YNrZaDUt
— Cinema Mania (@ursniresh) July 25, 2025