ఎప్పుడో 30 ఏళ్ల కిందట వచ్చిన మైనే ప్యార్ కియా మూవీలో తన అందంతో యువతను కట్టిపడేసింది భాగ్యశ్రీ. అలనాటి స్టార్ హీరోయిన్ ఇప్పుడు తలైవి తల్లిగా మరోసారి సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించనుంది. 11 ఏళ్ల తర్వాత మళ్లీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. జయలలిత జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన తలైవి మూవీలో కంగనా రనౌత్ తల్లి పాత్ర పోషించింది. మంగళవారం రిలీజైన ఈ మూవీ ట్రైలర్లో ఆమె కొన్ని సెకన్ల పాటు కనిపించారు. 52 ఏళ్ల భాగ్యశ్రీ చివరిసారి సునీల్‌శెట్టి నటించిన రెడ్ అలెర్ట్ అనే బాలీవుడ్ మూవీలో నటించారు. ఆ తర్వాత 2019లో ఓ కన్నడ సినిమాలో కనిపించినా.. బాలీవుడ్ మూవీలో నటించడం మాత్రం ఇదే తొలిసారి. మంగళవారం కంగనా బర్త్ డే సందర్భంగా భాగ్యశ్రీ ఆమెకు విషెస్ కూడా చెప్పింది.