భద్రాచలం, మార్చి 31: శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి భద్రగిరి ముస్తాబవుతున్నది. ఆలయ సన్నిధిలో ఏప్రిల్ 2 నుంచి వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. 10న శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం, 11న మహాపట్టాభిషేకం జరుగనున్నది. స్వామివారి కల్యా ణ ఘడియలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు చకాచకా ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ కారణంగా గత రెండేండ్లు ఆలయంలో ఆంతరంగికంగా జరిగిన వేడుకలు.. ఈ సారి ఘనంగా నిర్వహిస్తుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.