బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనపై సింగరేణి ప్రత్యేక దృష్టిపెట్టింది. సింగరేణి సంస్థ వ్యాప్తంగా ఆయా భూగర్భ, ఉపరితల గనుల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో టార్గెట్‌ను ఛేదించేందుకు కార్యాచరణ సిద్ధం చేసి, ఎప్పటికప్పుడు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తున్నది. తాజాగా మంగళవారం సీఎండీ శ్రీధర్ అన్ని ఏరియాల జీఎంలతో వీసీ ద్వారా సమీక్షించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓబీ తొలగింపు, సీహెచ్పీల పనితీరు, గనుల్లో పని స్థలాల పెంపు, ఓసీల్లో యంత్రాల పనితీరు తదితర అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు.
మణుగూరు రూరల్/రామవరం/కొత్తగూడెం, నవంబర్ 2: సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలకు అను గుణంగా యంత్రాంగం ముందుకెళ్లాలని సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి కోల్‌బెల్ట్ వ్యాప్తంగా అన్ని ఏరియాల జీఎంలతో ఉత్పత్తి, ఉత్పాదకత బొగ్గు రవాణాపై వీడియో కాన్ఫరెన్స్(వీసీ) నిర్వ హించారు. ఈ ఆర్థిక సంవత్సరం 70 మిలియన్ టన్నులు లక్ష్యం కాగా, ఇప్పటివరకు సాధించిన టార్గెట్ గురించి అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ప్రాజెక్టుల ప్రారంభానికి అవసరమైన పర్యావ రణ, ఇతర ప్రభుత్వ అనుమతులు, రామగుండం కోల్‌మైన్, జీడీకే-5 ఓసీపీ, నైనీ, పెనగడప ఓసీపీ, వీకే ఓసీపీ, రొంపేడు ఓసీపీ తదితర కొత్త ప్రాజెక్టుల దశ దిశను అడిగి తెలుసుకున్నారు. బొగ్గు ఉ త్పత్తి, రవాణా, ఓబీ తొలగింపు, సీహెచ్పీల పనితీరు, గనుల్లో పని స్థలాల పెంపు, ఓసీల్లో యం త్రాల పనితీరు తదితర అంశాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. ప్రతిరోజూ 40 రేకుల ద్వారా బొగ్గు రవాణా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న ఐదునెలల కాలంలో 330 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడంతో 8 పాటు అదే పరిమాణంలో బొగ్గును రవాణా చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని, ఈ మేరకు ఏరియాల వారీగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేపట్టడానికి నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు పోతున్నామని చెప్పారు. కాగా, అక్టోబర్‌లో తమ డివిజన్లో 108శాతం ఉత్పత్తి సాధించినట్లు ఆర్జీ-2 జీఎం వెంకటేశ్వర్రావు తెలిపారు. వీసీలో ఆర్జీ-3 నుంచి జీఎం మనోహర్, పీవో రాధాకృష్ణ, ఎం.నరేందర్ ఉన్నారు. ఆర్జీ-2 ఏరియా నుంచి ఎస్వోటూ జీఎం సాంబయ్య, ఏరియా ఇంజినీర్ రాధాకృష్ణారావు, ఓసీపీ-3 పీవో మోహన్‌రెడ్డి, ఐఈడీ డీజీఎం మురళీకృష్ణ, సీహెచ్‌పీ ఎస్ఈ సదానందం, క్వాలిటీ డిప్యూటీ మేనేజర్ వెంకటమోహన్, ఐటీ మేనేజర్ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అక్టోబర్ నెలలో 89శాతం ఉత్పత్తి సాధించినట్లు శ్రీరాంపూర్ జీఎం సురేశ్ తెలిపారు. ఆయన వెంట ఎస్వోటూజీఎం గుప్తా, ఏరియా ఇంజినీర్ కుమార్, ఓసీపీ పీవోలు పురుషోత్తంరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, ఐఈడీ డీజీఎం చిరంజీవులు, క్వాలిటీ డీజీఎం రమేశ్, సర్వే అధికారి రాఘవేంద్రరావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకనాథ్‌రెడ్డి, ఎస్టేట్స్ ఆఫీసర్ శ్రీనివాస్, ఐటీ ప్రోగ్రామర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ సింగరేణి భవన్లో డైరెక్టర్ ఆపరేషన్స్ చంద్రశేఖర్, డైరెక్టర్(పా) బలరాం, డైరెక్టర్(ఈఅండ్ఎం) సత్యనారాయణ, అడ్వైజర్ మైనింగ్ డీఎన్ ప్రసాద్, ఈడీ(సీఎం) జే.ఆల్విన్, జీఎం(కోఆర్డినేషన్) సూర్యనారాయణ, ఆయా ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.మణుగూరు రూరల్ ఏరియా నుంచి జీఎం జక్కం రమేశ్, అధికారులు నాగేశ్వరరావు, లలిత్‌కుమార్, వెంకటేశ్వర్లు, లక్ష్మీపతిగౌడ్, శ్రీనివాసచారి, వెంకట్రావు, నర్సిరెడ్డి, బొగ వెంకటేశ్వర్లు, రమేశ్, సురేశ్ పాల్గొన్నారు.కొత్తగూడెం ఏరియా నుంచి జీఎం నరసింహారావు ఏరియా ఇంజినీర్ రఘురామిరెడ్డి, ఇన్చార్జి ఎస్వోటూ జీఎం రమేశ్, ప్రాజెక్టు ఆఫీసర్లు, గని మేనేజర్లు, ప్రాజెక్టు ఇంజినీర్లు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
ఓబీ తొలగింపుపై..
సింగరేణిలో ఓసీపీ గనుల నుంచి ఓబీ తొల గింపు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లకు సంబంధించి విషయాలపై సంస్థ సీఎండీ శ్రీధర్ సమీక్షించారు. ఉపరితల గనుల నుంచి ఓబీ తొల గింపు పనులు వేగవంతం చేసేందుకు తీసుకోవా ల్సిన చర్యలు, ఓబీ తరలింపు సమయంలో పాటించాల్సిన రక్షణ చర్యలపై చర్చించారు. మేడిపల్లి ఓసీపీలో ఓబీ తొలగింపు పనులకు సంబంధించిన కాంట్రాక్టర్స్ చేపడుతున్న మట్టి తరలింపు పనులను అడిగి తెలుసుకున్నారు. ఓబీ రిమూవల్ మీదనే బొగ్గు ఉత్పత్తి ఆధారపడి ఉంటుందని, ఓసీపీల్లో ఓబీ తొలగింపులో కాంట్రాక్టర్లు కీలకపాత్ర పోషించాలన్నారు. ఇందులో ఆర్జీ-1 జీఎం కే నారాయణ, పీవో సత్యనారాయణ ఉన్నారు.
ఏడు నెలల్లో 68శాతం రవాణా: సీఎండీ
కొత్తగూడెం సింగరేణి, నవంబర్ 2: సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన ఏడునెలలల్లో గత ఏడాదితో పోలిస్తే రికార్డుస్థాయిలో 68శాతం వృద్ధితో బొగ్గు రవాణా, 60శాతం వృద్ధితో బొగ్గు ఉత్పత్తి సాధించిందని సంస్థ సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వీసీలో మాట్లాడారు. ఇంధన సరఫరా ఒప్పందం ఉన్న రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలతోపాటు ఇతర రాష్ర్టాల్లోని థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఏరియాల జీఎంలతో మాట్లాడుతూ రాష్ట్ర, దేశ విద్యుత్ అవసరాల రీత్యా లక్ష్యాలు సాధించాలని, ఈ ఏడాది సింగరేణి చరిత్రలోనే రికార్డుస్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, అమ్మకాలు జరపాలని, లాభాలు సాధించాలని పిలుపునిచ్చారు.