Bhaag Saale Movie OTT | మత్తు వదలరా(Mathu Vadhalara) వంటి వినూత్న కథతో ఎంట్రీ ఇచ్చి తొలి అడుగులోనే సక్సెస్ అయ్యాడు శ్రీసింహ (Sri Simha). యంగ్ టాలెంట్ అంతా కలిసి కష్టపడి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపించింది. కాగా శ్రీసింహా హీరోగా నటించిన తాజా చిత్రం ‘భాగ్ సాలే’. ఈ సినిమా తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
‘క్రైమ్’ కామెడీ జోనర్లో వచ్చిన ఈ సినిమా ఫన్ ఎంటర్ టైనర్‌గా ఆలరించి మంచి విజయం సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) దక్కించుకోగా.. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో తెలిపారు.
Exciting Crime – Comedy Entertainer of the Season #BhaagSaale is now running on @PrimeVideoIN 💍🏃🏻♂️#BhaagSaaleOnPrime 😉 https://t.co/KMtVSXnZ5M@Simhakoduri23 @IamPranithB @kaalabhairava7 @NehaSolanki_ @arjundasyan @VCWOfficial @YashBigBen @KALYANASINGAMA1 @GskMedia_PR pic.twitter.com/5ktcrknMPB
— BA Raju’s Team (@baraju_SuperHit) August 4, 2023
అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రణీత్ బ్రమండపల్లి దర్శకత్వం వహించాడు. సింహకు జోడీగా నేహ సోలంకి నటించింది. వైవా హర్ష, రాజీవ్ కనకాల కీలకపాత్రలు పోషిస్తున్నారు. బిగ్ బెన్ సినిమా, సినీ వాల్లే మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించాడు.