Adilabad | నార్నూర్, అక్టోబర్ 27 : గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్యాధికారి రాజమణి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గుంజాల సబ్ సెంటర్ పరిధిలోని గర్భిణీలకు వైద్య పరీక్షలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిణి మాట్లాడుతూ మాతా శిశువు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్యమైన పోషకాహారాన్ని తినాలని సూచించారు.
ప్రతీనెల వైద్య పరీక్షలు చేయడంతో పాటు ఐరన్ మాత్రలు, ఇంజక్షన్లు తప్పనిసరిగా తీసుకోవాలని గర్భిణీలకు సూచించారు. అంగన్వాడి కేంద్రాలలో అందించే ఆహారాన్ని తప్పక తినాలన్నారు. పలు సలహా సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈవో తులసీదాస్, సీహెచ్వో లక్ష్మి, సూపర్వైజర్ చరణ్ దాస్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఉన్నారు.