న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వివిధ పేర్లతో రిపబ్లిక్ డే సేల్ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ సేల్ ఈవెంట్లు ఇప్పటికే ప్రారంభం కాగా పిక్సెల్ 6ఏ, నథింగ్ ఫోన్ 1, శాంసంగ్ గెలాక్సీ ఎస్22, రెడ్మి 11 ప్రైమ్ వంటి పలు ప్రముఖ స్మార్ట్ఫోన్లపై ఈ సేల్‌లో భారీ ఆఫర్లను ప్రకటించారు. 5జీ ఫోన్లపై బెస్ట్ డీల్స్‌ను ఈ-కామర్స్ దిగ్గజాలు ఆఫర్ చేస్తుండటంతో హాట్ డివైజ్‌లను సొంతం చేసుకునేందుకు కస్టమర్లు ఆసక్తి కనబరుస్తున్నారు.
5జీ ఫోన్ డీల్స్ రూ .11,999 నుంచి ప్రారంభమయ్యాయి. శాంసంగ్ ఫోన్ ప్రియులు అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో గెలాక్సీ ఎం13 5జీని రూ .11,999కి కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. ఇదే ధరలో మరింత మెరుగైన ఫోన్‌ను కోరుకునేవారు అమెజాన్‌లో రూ . 12,999కి లిస్టయిన రెడ్మి 11 ప్రైమ్‌ను పరిశీలించవచ్చు.
ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై కొనుగోలు చేసేవారికి ఈ ఫోన్‌పై రూ .1250 వరకూ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. ప్లిఫ్కార్ట్పై నథింగ్ ఫోన్ (1) ధర అత్యంత కనిష్టంగా లిస్టయి రూ . 27,499కి లభిస్తోంది. ఈ మిడ్ రేంజ్ ఫోన్‌ను భారత్‌లో రూ . 31,000 పైబడిన ధరలో లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎస్బీఐ బ్యాంక్ కార్డు ఆఫర్‌తో రెడ్మి కే50ఐని రూ . 20,999కి కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. ఇది గుడ్ ఆల్‌రౌండర్ మిడ్ రేంజ్ 5జీ ఫోన్‌గా గుర్తింపు పొందింది. ఇక ఐఫోన్ 13 128జీబీ స్టోరేజ్ మోడల్ రిపబ్లిక్ డే సేల్ ఈవెంట్లో భాగంగా డిస్కౌంట్ ఆఫర్‌పై రూ 59,499కి లభిస్తుండగా, పిక్సెల్ 6ఏ రూ . 29,999కి అందుబాటులో ఉంది.