బెంగుళూరు: సిలీకాన్ వ్యాలీ బెంగుళూరు ఇప్పుడు నీటితో నిండిపోయింది. ఇక ఐటీ ఉద్యోగుల అవస్థలు చెప్పలేనివి. కార్లలో ఆఫీసులకు వెళ్లాల్సిన టెకీలు ఇప్పుడు ట్రాక్టర్లలో జాబ్‌కు వెళ్తున్నారు. హెచ్ఏఎల్ విమానాశ్రయం వద్ద ఉన్న యెమలూర్ ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఐటీ ఉద్యోగులు తమ ఆఫీసులకు ట్రాక్టర్లలో వెళ్తున్నారు. ఆఫీసులో లీవ్‌లు తీసుకునే వెసలుబాటు లేదని, అందుకే ట్రాక్టర్లలో ఆఫీసుకు వెళ్తున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. గత 90 ఏళ్లలో ఇలాంటి వర్షం పడలేదని సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు. జల దిగ్భంధం సమస్య గురించి ఐటీ కంపెనీలతో మాట్లాడనున్నట్లు సీఎం చెప్పారు. నష్టపరిహారంతో పాటు ఇతర అంశాల గురించి చర్చించనున్నట్లు ఆయన వె ల్లడించారు. వాటర్ జామ్ కావడం వల్ల అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఉద్యోగులు, స్థానికులు ఇబ్బందులు పడ్డారు.
VIP treatment pic.twitter.com/OENbNLybtn
— DID intern ⚛️ (@bhushan_vikram) September 5, 2022