మంచిర్యాల, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదన్న గుబులుతో బీపీ ఎక్కువై గుండెపోటుతో ఓ లబ్ధిదారు మృతిచెందింది. కు టుంబసభ్యుల కథనం ప్రకారం.. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లికి చెందిన పానుగంటి మల్లు (58)కు ఒక్కడే కొడుకు. కుటుంబమంతా కూలి పనులు చేసుకొని బతుకుతుంటారు. మల్లు పేరుపై ఇందిరమ్మ ఇల్లు మం జూరు కావడంతో అప్పు తెచ్చి, బంగారం కుదవపెట్టి బేస్మెంట్ వేసుకున్నారు. ఆగస్టులో ముగ్గుపోసి పిల్లర్లు తవ్వుకున్నారు. కానీ, వర్షాలకు గుంతలు మునిగిపోవడం తో హైట్ లేపి, సెప్టెంబర్ నెలాఖరుకు పిల్లర్లువేసి, బేస్మెంట్ నిర్మించారు. మట్టి పోసి పనులు చేయాల్సి రావడంతో 3 లక్ష లు ఖర్చు అయింది.
బేస్మెంట్ నిర్మించా క అధికారులు వచ్చి ఫొటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేసేందుకు యత్నించగా, లొకేషన్ మిస్ మ్యాచ్ అని తీసుకోలేదు. దీంతో కుంగిపోయిన మల్లు మూడు రోజు ల కిత్రం అనారోగ్యంతో హాస్పిటల్లో చేరి, గుండెపోటులో చనిపోయింది. అద్దె ఇల్లు కావడంతో వేంపల్లి వాగు సమీపంలోనే టెంట్ వేసి మల్లు మృతదేహానికి దహన సంస్కారాలు చేశారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని సంబురపడితే.. చివరకు టెంట్ వేసి దహనసంస్కారాలు చేయాల్సి వచ్చిందంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఆరు నెలలైనా బిల్లు మంజూరు కాకపోవడం, లోకేషన్ మిస్ మ్యాచ్ సమస్య పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే మల్లు చనిపోయిందని వాపోయారు.

లొకేషన్ మిస్ మ్యాచ్ సమస్యతో మల్లుకు బిల్లు రాలేదు. కలెక్టర్‌కు ఈ విషయమై లెటర్ పెట్టారు. సమస్య పరిష్కారమైంది. పానుగంటి మల్లు ఫొటోలు తీసి అప్లోడ్ చేసి 15 రోజులు అవుతుంది. బిల్లు మంజూరైంది. ఆమె మరణానికి ఇందిరమ్మ ఇల్లు బిల్లుకు సంబంధం లేదు. కూలి పనికి వెళ్లిన సమయంలో వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురైనట్టు మాకు తెలిసింది.
వీడియో విడుదల చేయించిన కాంగ్రెస్
ఇందిరమ్మ ఇంటికి బిల్లు రాలేదన్న గుబులుతో అనారోగ్యం పాలై, గుండెపోటుతో మల్లు మృతి చెందిందని కుటుంబసభ్యులే ఆదివారం దహన సంస్కారాలు నిర్వహించే సమయంలో మీడియాకు చెప్పారు. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు రాత్రి బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడించి వీడియో, ప్రెస్‌నోట్ విడుదల చేయించారు. ఉదయం ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదన్న బాధతోనే అనారోగ్యం పాలైందని చెప్పిన కుటుంబసభ్యులతో, రాత్రి వడదెబ్బ తగిలిందంటూ వీడియో విడుదల చేయించారు. ఇది కాంగ్రెస్ దిగజారుడు, బెదిరింపు రాజకీయాలకు నిదర్శమంటూ స్థానికులు మండిపడుతున్నారు.