‘పిల్లల్ని కనడానికి పెళ్లే అవసరం లేదు. ఒక ప్రాణానికి జన్మనివ్వాలనే కోరికను సామాజిక హోదాతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు’ అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది సహజనటి నిత్యామీనన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి.
‘నేను పెళ్లికి వ్యతిరేకం కాదు. కానీ కొందరు పెళ్లి లేనిదే జీవితమే వ్యర్థం అన్నట్టు మాట్లాడుతుంటారు. వారికి నేను వ్యతిరేకం. మరో జీవికి జన్మనివ్వడం అనేది జన్మతహః స్త్రీకి భగవంతుడిచ్చిన హక్కు. దానికి పెళ్లితో ప్రమేయం లేదు. తల్లి కావాలనుకోవడం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం’ అని పేర్కొన్నది నిత్యామీనన్.