సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా ప్రియాంక ఆల ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమెను రాష్ట్ర ప్రభుత్వం సిటీ కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కలెక్టర్గా పనిచేసిన హరిచందన ఎల్ఈటీ అండ్ ఎఫ్ సెక్రెటరీగా బదిలీ అయ్యారు.