Huzurabad | అంగన్వాడీల జీతాలు 3 సార్లు పెంచాం: హరీశ్‌రావు

హుజురాబాద్:పనిచేసే ప్రభుత్వానికి అంగన్వాడీలు అండగా ఉండాలని, అంగన్ వాడీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలో టీఎన్జీఓలు, అంగన్ వాడీలు నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. గతంలో పోరాటాలు చేస్తే కూడా జీతాలు పెంచని దుస్థితి ఉండేదని, ధర్నాలు చేస్తే గుర్రాలతో తొక్కించిన ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం అంగన్ వాడీల జీతాలు 7 సంవత్సరాల్లో 3 సార్లు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు.
భారత దేశ చరిత్రలోనే కాంట్రాక్టు, ఇతర చిన్న ఉద్యోగులకు కుడా ప్రభుత్వ ఉద్యోగులకు పెంచినట్లు గానే జీతాలు పెంచుతున్నా మన్నారు. అంగన్వాడీలకు గుజరాత్ రాష్ర్టంలో అధికారంలో ఉన్నబీజేపీ తెలంగాణలో మనం ఇస్తున్న జీతంలో సగం కూడా ఇవ్వడం లేదన్నారు. అంగన్ వాడీ జీతాలు కేంద్రం ప్రభుత్వం ఇస్తుందని బీజేపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, అవన్నీ పచ్చి అబద్ధాలు, కేంద్రం ఇచ్చేది కేవలం రూ. 2700, మాత్రమేనని, రాష్ట్రం ఇచ్చేది 10950/- అని స్పష్టం చేశారు.

అంగన్ వాడీలకు మొదటి వారంలోనే జీతాలు వచ్చేలా చూస్తానని, 450 మంది అంగన్ వాడీ లకు సూపర్ వైజర్లుగా ప్రమోషన్స్ ఇప్పిస్తానని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా అర్హులైన అంగన్ వాడీలకు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు. హుజురాబాద్ నియోజకవర్గానికి 4000 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు సీఎం కేసీఆర్ మంజూరు చేస్తే, ఒక్క ఇల్లు కట్టి లభ్డిదారులకు ఇవ్వలేదు, దానికి బాద్యులు మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ది కదా, అని హరీష్ రావు ప్రశ్నించారు.
పని చేసే వ్యక్తికి మద్దతు ఇవ్వండి, తెలంగాణ, కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాన్నారు. ఆసరా పింఛన్లు, రైతు బంధు, కల్యాణ లక్ష్మీ ని అపహాస్యం చేసిన వ్యక్తులు ఎవరో మీకు తెలుసు, ఈ పథకాలను పరిగే అన్న వ్యక్తి, మీ మాజీ ఎమ్మెల్యే అన్నారు.
అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 30 శాతం ఫిట్మెంట్ ఇస్తున్నామన్నారు. ఒక పక్క పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న కేంద్రం వంట గ్యాస్ ధరలు పెంచి వచ్చే సబ్సిడీని తగ్గించిందని ఆరోపించారు. అంగన్ వాడీ సమస్య ల్లో నా పరిధిలో ఉన్నవి పరిష్కరిస్తా. మిగతా సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

మరో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ అంగన్ వాడీ లు చేసేది ఉద్యోగం కాదని సమాజ సేవ అని కీర్తించారు, వారికి ఎంత జీతం ఇచ్చిన తక్కువే అని గ్రహించిన సీఎం కేసీఆర్, జీతాలు పెంచారన్నారు. అంగన్వాడీలు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారని. తెలంగాణ వచ్చాకే వారికి జీతాలు పెంచారన్నారు. కరీంనగర్ జిల్లాలో అంగన్ వాడీలు ఉద్యమం లో ఎక్కువ భాగస్వామ్యం అయ్యారని. వారి కృషి గొప్పదన్నారు.
టీఎన్జీవో మాజీ నేత దేవి ప్రసాద్ మాట్లాడుతూగతంలో అంగన్ వాడీలు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తే అప్పటి ప్రభుత్వాలు గుర్రాలతో తొక్కించారన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ అడగకుండానే జీతాలు పెంచారన్నారు. ఈ సభలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు మారం జగదీదీశ్వర్, హుజురాబాద్ టీఆర్ ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్, కౌశిక్ రెడ్డి, జయ, శిరీష, స్వరూప, భాగ్య లు పాల్గొన్నారు,
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

