హిమాయత్‌నగర్, జనవరి24: రాజ్యాం గం కల్పించిన హక్కులను కాపాడుకుం టూ బీసీలు సామాజిక న్యాయ సాధన కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు అన్నారు. సోమవారం సామాజిక వేత్త, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా రా జ్యాంగం- సమాజంలో బీసీల పాత్ర అనే అంశంపై హిమాయత్ నగర్‌లోని బీసీ భవన్లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ డీఆర్వో ఎం.సూర్యనారాయణ, బీసీ సంస్థ నాయకుడు భీమనపల్లి విఠోభా మాట్లాడుతూ రాష్ట్రంలో 54శాతం ఉన్న బీసీలు సంఘటితంగా లేక పోవడంతో ఆయా రంగాల్లో వెనుకబడి ఉన్నామన్నారు. అందుకోసం మరింత చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగపరం గా వచ్చే హక్కులు సాధించుకునేందుకు గ్రామీణ స్థాయి నుంచి చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజలే పరిపాలన చేసేందుకు సమాయత్తం కావాలన్నారు. సమావేశంలో నాయకులు డాక్టర్ టీవీ రామ నర్సయ్య, జనార్దన్, దానకర్ణచారి పాల్గొన్నారు.