ముంబై: లండన్‌లో జరిగిన ది హండ్రెడ్ వేలం లో సన్‌రైజర్స్ లీడ్స్ జట్టు.. పాకిస్థానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ బీసీసీఐ స్పందించింది. ఇది తమకు సంబంధం లేని అంశమని కుండబద్దలు కొట్టింది. ఇదే విషయమై తనను కలిసిన పాత్రికేయులతో బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ‘మా పరిధి ఐపీఎల్‌కే పరిమితం.
విదేశీ లీగ్‌లో నిర్వహించిన వేలంలో ఆ జట్టు (సన్‌రైజర్స్) కొనుగోలు చేసిన ఆటగాళ్ల గురించి మేం ఎలా జోక్యం చేసుకోగలం? అది పూర్తిగా వారి నిర్ణయం. దాంతో మాకేం సంబంధం లేదు. ఐపీఎల్లో మాత్రం వారు (పాకిస్థాన్ ఆటగాళ్లు) ఆడటం లేదు’ అని తెలిపాడు. గురువారం జరిగిన వేలం ప్రక్రియలో సన్‌రైజర్స్.. అబ్రార్‌ను రూ. 2.34 కోట్లకు దక్కించుకున్న విషయం విదితమే.
ఇదిలాఉండగా సన్‌రైజర్స్ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత అభిమానులు ఆ జట్టు లీడ్స్ ఫ్రాంచైజీ ఎక్స్ ఖాతాకు పెద్దసంఖ్యలో రిపోర్ట్ కొట్టడంతో అది కాస్తా సస్పెన్షన్‌కు గురైంది. అయితే కొద్దిసేపటి తర్వాత దానిని మళ్లీ పునరుద్ధరించారు. ఈ వివాదం ఇలాగే కొనసాగితే రాబోయే ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నెటిజన్ల నుంచే గాక సొంత అభిమానుల నుంచి తిప్పలు తప్పేలా లేవన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.