న్యూఢిల్లీ: సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు జరగనున్న ఆసియా క్రీడల(Asian Games 2023)కు మహిళలు, పురుషుల క్రికెట్ల జట్లను పంపించే ఆలోచనల్లో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. టీ20 ఫార్మాట్లో ఆ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. చైనాలోని హాంగ్జావూలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. అయితే ఆ సమయంలో వరల్డ్‌కప్ ఉన్న నేపథ్యంలో ఆసియా క్రీడలకు పురుషుల బీ బృందాన్ని పంపాలని బీసీసీఐ భావిస్తోంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు వన్డే వరల్డ్‌కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఆసియా క్రీడలకు ఏ గ్రేడ్ మహిళల క్రికెట్ జట్టును మాత్రం పంనున్నారు. జూన్ 30వ తేదీ లోగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు క్రికెటర్ల జాబితాను బీసీసీఐ పంపనున్నది.