ముంబై : వచ్చే ఐపీఎల్ సీజన్ షెడ్యూల్లో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత సీజన్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటూ బీసీసీఐ లీగ్‌ను త్వరగా ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నది. బీసీసీఐ కార్యదర్శి దేవిజత్ సైకియా వ్యాఖ్యలు దీనికి మరింత బలాన్ని చేకూర్చాయి. మే నెలలో దేశంలో వేడి వాతావరణ పరిస్థితుల్లో ప్లేయర్లను అవస్థను దృష్టిలో పెట్టుకుని మార్చి నెలాఖరులో గాకుండా 10 లేదా 15వ తేదీ నుంచి లీగ్ మొదలుపెట్టేందుకు ఆలోచిస్తున్నట్లు సైకియా పేర్కొన్నారు.
మరోవైపు శ్రీలంక ‘ఏ’ జట్టు ప్లేయర్లతో గొడవకు దిగిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సైకియా స్పష్టం చేశారు. ప్లేయర్లు ఎవరైనా వివాదాలకు పోకుండా ఆటపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నాడు. మెరుగైన ప్రదర్శనతో ట్రోఫీ గెలువాలనే లక్ష్యంపై జట్టు దృష్టి పెట్టాలని సూచించారు.