ఈమధ్య పిల్లల్లో కూడా కాళ్ల పగుళ్లు కనిపిస్తున్నాయి. సాధారణంగానే శరీర బరువంతా కాళ్ల మీద పడుతుంది. గంటల తరబడి నిల్చున్నప్పుడు ఆ ఒత్తిడి మరింత అధికం అవుతుంది. కాళ్ల దగ్గర నూనె గ్రంథులు తక్కువైపోయి, చెమట ఎక్కువగా చేరడంవల్ల చర్మం పొడిబారిపోయి, పాదం గరుకుగా మారుతుంది. క్రమంగా పగుళ్లు పెరిగిపోయి, పొట్టు రాలడం మొదలవుతుంది.
ఇలాంటప్పుడు, కాళ్లను శుభ్రం చేసుకోవడానికి రసాయనాలు లేని సబ్బులు వాడాలి. స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారానికోసారి ఇంట్లో కొబ్బరినూనె, ఉప్పు కలిపి పాదాలను స్క్రబ్ చేసుకోవాలి.