సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఇంట్లో కూర్చోని వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీనిని ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు సరికొత్త రకాల మోసాలకు తెరలేపుతున్నారు. ఇప్పటికే ఆన్లైన్ ట్రేడింగ్, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్న కేటుగాళ్లు, ఇప్పుడు ప్రముఖ ఈ కామ ర్స్ సంస్థలకు సంబంధించి గూడ్స్ డెలివరీ ప్రాంచైజ్ ఇస్తామంటూ అమాయకులను నిలువునా ముంచుతున్నారు. సైబర్ నేరగాళ్లు ప్రజలను నమ్మించడానికి పక్కా ఫ్లాన్‌తో రంగంలోకి దిగుతున్నారు. మొదట ఇ కామర్స్ ఫ్రాంచైజ్‌కు అవకాశముంది, నెలకు లక్షల్లో సంపాదించవచ్చంటూ వాట్సాప్, టెలిగ్రామ్, ఈమెయిల్స్ ద్వారా సందేశాలు పంపిస్తున్నారు.
అందు లో ఫోన్ నెంబర్లు ఇస్తున్నారు. ఈ మేసేజ్‌లు చూసిన వారు అందులో ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేస్తున్నారు. మాట్లాడే వాళ్లు అసలైన సంస్థకు చెందిన వారుగా బాధితులు భావిస్తున్నారు. మేం మీకు ఒక ఫామ్ పంపిస్తాం అందులో మీ వివరాలు పొందుపరచడంటూ సద రు సంస్థల లోగోలతో లింక్‌లు సృష్టించడం, లేదంటే ఫారాన్ని పంపించడం చేస్తున్నారు. బాధితులు అందులో వివరాలు నింపిన తరువాత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలంటూ నెమ్మదిగా మోసాన్ని ప్రారంభిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ ఫీజు కాగానే సెక్యూరిటీ డిపాజిట్, సాప్ట్వేర్ ఛార్జీలు, లీగల్ అగ్రిమెంట్ ఫీజులు అంటూ లక్షల్లో దోచేస్తున్నారు. బాధితుల నుంచి అందిన కాడికి లాగుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మల్కాజిగిరిలో ఒక బిల్డర్‌కు ఈమెయిల్ పంపించి, అమేజాన్ డిస్ట్రిబ్యూషన్ హబ్ పార్టనర్ ఇస్తామంటూ నమ్మి ంచి రూ. 3 లక్షలు మోసం చేశారు. ప్రతి రోజు ఒకరిద్దరికి ఇలాం టి ఈ మెయిల్స్, సోషల్‌మీడియా యాప్స్ ద్వారా మెసేజ్‌లు వస్తున్నాయి.
అప్రమత్తతతోనే చెక్
సైబర్మోసాలకు చెక్ పెట్టాలంటే ప్రధానమైంది అవగాహనేనని పోలీసులు పేర్కొంటున్నారు. అత్యాశకు పోయి గుడ్డిగా గుర్తుతెలియని వ్యక్తులు చెప్పే మాటలు ఆన్లైన్ ద్వారా తెలుసుకొని మోసపోవద్దని పోలీసులు చెబుతున్నారు. ట్రేడిం గ్, పార్ట్‌టైమ్ ఉద్యోగాలంటూ వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వచ్చే ప్రకటనలు చూసి నమ్మొద్దని పోలీసులు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండడంతోనే సైబర్ నేరాలను కట్టడి చేయవచ్చని పోలీసులు చెబుతున్నారు.