కవాడిగూడ, జూన్ 5: ఖైరతాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఉదయం 11 గంటలకు బీసీ కుల సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్టు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డీ రాజారాంయాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కులగణన బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని కోరనున్నట్టు పేర్కొన్నారు. సమావేశానికి ఆర్ కృష్ణయ్య, బండ ప్రకాశ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, జూలూరి గౌరీశంకర్, సంగెం సూర్యారావు, జీ చెన్నయ్య, సంజీవ్‌నాయక్ తదితరులు హాజరవుతారని వెల్లడించారు.