Big Bash League | హోబర్ట్ : ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) 2024-25 సీజన్ ట్రోఫీని హోబర్ట్ హరికేన్స్ సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు సిడ్నీ థండర్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. హోబర్ట్‌కు బీబీఎల్‌లో ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ.. 20 ఓవర్లకు 182/7 స్కోరు చేసింది. ఛేదనను హోబర్ట్ 14.1 ఓవర్లలోనే పూర్తిచేసింది. ఓపెనర్ మిచెల్ ఒవెన్ (42 బంతుల్లో 108, 6 ఫోర్లు, 11 సిక్సర్లు) వీరవిధ్వంసంతో ఆ జట్టు ఘనవిజయాన్ని అందుకుంది.