పూలజాతర
తెలంగాణ జనజీవన ప్రతీక బతుకమ్మ ముగురమ్మల మూలమైన బతుకమ్మ శ్రీచక్ర స్వరూప రూపరేఖ బతుకమ్మ
తెలంగాణ జనజీవన ప్రతీక బతుకమ్మ
ముగురమ్మల మూలమైన బతుకమ్మ
శ్రీచక్ర స్వరూప రూపరేఖ బతుకమ్మ
బహుగాథలందు తేజరిల్లు బతుకమ్మ
పౌరాణికమున శక్తిరూపిణి బతుకమ్మ
చారిత్రకమందు ఘనచరిత బతుకమ్మ
సామాజికమున త్యాగశీలి బతుకమ్మ
కౌటింబికాన బ్రతుకునిచ్చు బతుకమ్మ
గాథలేవైనా ప్రకృతికి జోడే బతుకమ్మ
పర్యావరణ మైత్రీబంధం బతుకమ్మ
పల్లెపట్నాల పూలజాతర బతుకమ్మ
బ్రతుకుబాటల ఆటపాటైన బతుకమ్మ
జానపదుల బ్రతుకుగీతమే బతుకమ్మ
వాణి లేని కొత్తబాణిలో నేటి బతుకమ్మ
నోటిపాట చేతి ఆట కరువైన బతుకమ్మ
వేషధారణపై మక్కువ ఆటేమో తక్కువ
చుట్టుగముడు దూరపు చుట్టమాయె
డీజేల మోతలోన డాన్సు లెక్కువాయె
పల్లెపాట మూగదై బ్రతుకు భారమాయె
చప్పట్లు లేక ఆట చప్పబడిపోతున్నది
మన నోటిపాట చేతి ఆట జనజాగృతమవ్వాలి
గునుగు తంగేడులు నవ్వులైవిరియాలి
ఆబాలగోపాలానికి ఆనందం ఇవ్వాలి
ఆడబిడ్డల ఆత్మగౌరవ ఖ్యాతి బతుకమ్మ
బ్రతుకునిచ్చు బతుకమ్మను కాపాడాలి
గత వైభవ కీర్తులతో బతుకమ్మ ఆడాలి
తెలంగాణ సంస్కృతిని లోకానికి చాటాలి
డా.నమిలకొండ సునీత
9908468171
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

