శాంతియుత నిరసనకారులను అక్రమంగా నిర్బంధించొద్దు
శాంతియుతంగా సమావేశమైన ప్రజలను అక్రమంగా నిర్బంధించ రాదని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. అధికారులు ఎవరినైనా నిర్బంధించే చర్యలు చట్టాన్ని అనుసరించి ఉండాలని , చట్టవిరుద్ధ నిర్బంధాలు వద్దని పేర్కొంది.
- ఢిల్లీలో ఇంటర్నెట్, మెట్రో సేవలు పునరుద్ధరించండి అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 11 : శాంతియుతంగా సమావేశమైన ప్రజలను అక్రమంగా నిర్బంధించ రాదని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. అధికారులు ఎవరినైనా నిర్బంధించే చర్యలు చట్టాన్ని అనుసరించి ఉండాలని , చట్టవిరుద్ధ నిర్బంధాలు వద్దని పేర్కొంది. ‘సర్’లో అక్రమాలను నిరసిస్తూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీ వ్యాప్తంగా నిరసనలు జరిపిన ఆందోళనకారులను పెద్దయెత్తున ఢిల్లీ పోలీసులు, భద్రతా బలగాలు అక్రమంగా నిర్బంధించిన క్రమంలో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లు, ఇతర కేసుల అత్యవసర విచారణ కోసం సుప్రీంకోర్టు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమైంది.
పోలీస్ ఆంక్షల చట్టబద్ధత, పరిధిని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లనూ విచారించింది. బీఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమలులో ఉన్న ప్రాంతాల వెలుపల శాంతియుత నిరసనకారులను చట్టం నిర్దేశించిన విధానానికి అనుగుణంగా తప్ప అక్రమంగా నిర్బంధించరాదని ధర్మాసనం ఆదేశించింది. శాంతిభద్రతలను కాపాడటానికి ఆంక్షలు తప్పనిసరి అయినప్పటికీ మెట్రో, ఇతర రైలు సర్వీసులు యథాతథంగా నిర్వహించాలని బెంచ్ ఆదేశించింది. అలాగే చట్టప్రకారం ఇంటర్నెట్ సర్వీసులకు ఆటంకం కలగరాదని పేర్కొంది.
సుప్రీంకోర్టుకు వెళ్లి అలసిపోయా! : సిబల్
‘మేం సుప్రీంకోర్టుకు వెళ్లి వెళ్లి అలసిపోయాం. ఇక్కడకు వచ్చినా పెద్దగా ఉపయోగం ఉండట్లేదు. మేం ఇక సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదేమో అనిపిస్తున్నది’ అని కపిల్ సిబల్ తన అసంతృప్తిని బయటపెట్టారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న ప్రజలను నిర్బంధించడంపై కోర్టు ఎందుకు సరైన ఆదేశాలు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై ఆదివారం కోర్టు స్పందించింది. సిబల్‌కు కోర్టులపై ఉన్న నమ్మకాన్ని పునరుద్ధరిస్తామని పేర్కొంటూ పై ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను సిబల్ స్వాగతించారు. న్యాయస్థానం ఆదేశాలు సామాన్య ప్రజలతోపాటు న్యాయవాదుల్లో విశ్వాసాన్ని పెంచాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

