బ్లూమ్స్‌బర్గ్ బిలియనీయర్ల సూచీలో ఆసియాలో అత్యంత సంపన్న మహిళగా అగ్రస్థానాన్ని దక్కించుకున్న భారతీయ వ్యాపారవేత్త?
అమెరికాలోని సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ఒకేసారి పైలట్, కోపైలట్‌గా విమానయానం చేసిన తొలి తల్లీకూతుళ్ల జంటగా రికార్డు సాధించింది ఎవరు?
ప్రయాణికులను మోసుకెళ్లడానికి మహారాష్ట్రలోని పూణేకు చెందిన స్టార్టప్ కంపెనీ తయారుచేసిన డ్రోన్ పేరేంటి?
అమెరికాలోని న్యూజెర్సీ నగరంలో జరిగిన మిస్ ఇండియా యూఎస్ఏ 2022 అందాల పోటీల్లో విజేతగా నిలిచిన భారతీయ అమెరికన్ ఎవరు?
భారతదేశపు ప్రసిద్ధ శాస్త్ర పరిశోధన సంస్థ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సీఎస్ఐఆర్) డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన తొలి మహిళ?
చేతివేళ్లకు అత్యంత పొడవైన గోళ్లు ఉన్న మహిళగా గిన్సిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎవరు చోటు దక్కించుకున్నారు?
ఇటీవల జరిగిన కామన్వెల్త్ క్రీడల..పతకాల పట్టికలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలవగా, భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది?
చేనేత రంగంలో ప్రతిభ కనబరిచిన కళాకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా అందించే కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కారం ఈ ఏడాది ఎవరికి దక్కింది?
భూమి తన చుట్టు తాను తిరిగేందుకు ఒకరోజు (24 గంటలు) సమయం తీసుకుంటుంది.అయితే ఇటీవల భ్రమణ వేగం పెరిగిన కారణంగా రోజును 1.59 మిల్లీ సెకన్ల ముందే పూర్తిచేసుకుంది. అది ఏ తేదీన జరిగింది?
భగవద్గీత శ్లోకాల స్ఫూర్తి ప్రతిఫలించేలా 260 అడుగుల భారీ నిర్మాణంతో ఆసియా ఖండంలోనే అతి ఎత్తయిన దేవాలయాన్ని ఎక్కడ నిర్మించాలని తలపెట్టారు?
జవాబులు
1. సావిత్రీబాయి జిందాల్ (నికర సంపద: 11.3 బిలియన్ డాలర్లు)
2. కెప్టెన్ హోలీ పెటిట్ (తల్లి), ఫస్ట్ ఆఫీసర్ కెల్లీ పెటిట్ (కూతురు)
3. వరుణ
4. ఆర్య వాల్వేకర్
5. నల్లతంబి కలైసెల్వి
6. డయానా ఆర్మ్‌స్ట్రాంగ్ (అమెరికాలోని మిన్నెసోటా)
7. 4వ స్థానంలో ( 22 స్వర్ణం, 16 రజతం, 23 కాంస్యం)
8. యాదాద్రి జిల్లా పుట్టపాకకు చెందిన సామల వెంకటేశ్వర్లు
9. 2022 జూన్ 29 (ఇప్పటివరకు నమోదైన అత్యంత చిన్నదైన రోజు ఇదే)
10. హరియాణాలోని కురుక్షేత్రలో