క్యూ3లో 6.6 శాతమే
దేశ జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) మూడో త్రైమాసికం (క్యూ3 లేదా అక్టోబర్-డిసెంబర్)లో 6.6 శాతంగానే నమోదు కావచ్చని విదేశీ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. రెండో త్రైమాసికం (క్యూ2 లేదా జూలై-సెప్టెంబర్)లో వృద్ధిరేటు 8.4 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. క్యూ3 గణాంకాలను ఈ నెల 28న జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేయనున్నది.
- దేశ జీడీపీపై బార్క్లేస్ అంచనా
ముంబై, ఫిబ్రవరి 22: దేశ జీడీపీ ఈ ఆర్థిక సంవత్సరం (2021-22) మూడో త్రైమాసికం (క్యూ3 లేదా అక్టోబర్-డిసెంబర్)లో 6.6 శాతంగానే నమోదు కావచ్చని విదేశీ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. రెండో త్రైమాసికం (క్యూ2 లేదా జూలై-సెప్టెంబర్)లో వృద్ధిరేటు 8.4 శాతంగా ఉన్న విషయం తెలిసిందే. క్యూ3 గణాంకాలను ఈ నెల 28న జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేయనున్నది. ఈ క్రమంలోనే బార్క్లెస్ పైవిధంగా స్పందించింది. నిజానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత జీడీపీ 10 శాతంగా ఉండొచ్చని గతంలో బార్క్లేస్ అంచనా వేసింది. అయితే తాజా అంచనా ఇంతకంటే తక్కువ ఉండటం గమనార్హం. అక్టోబర్-డిసెంబర్లో కరోనాకు ముందున్న స్థాయిలో వివిధ రంగాల పనితీరు నమోదైనా.. జనవరిలో కరోనా థర్డ్ వేవ్ రావడం అంచనాలను ప్రభావితం చేసింది. ఇదిలావుంటే తయారీ రంగం కంటే సేవల రంగమే దేశ ఆర్థిక ప్రగతికి దోహదపడగలదని బార్క్లేస్ ఈ సందర్భంగా అంచనా వేయడం విశేషం. గనులు, నిర్మాణ, తయారీ రంగాల్లో ప్రగతి నెమ్మదించినట్టు పేర్కొన్నది. అయినప్పటికీ ఈ జనవరి-మార్చి త్రైమాసికం (క్యూ4)లో జీడీపీ బాగానే నమోదు కావచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

