Bandi Sai Bhageerath | పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకు బండి సాయి భగీరథ్ కనిపించడం లేదు అనే పోస్టర్లు ఇప్పుడు నిజామాబాద్‌లోనూ వెలిశాయి. భగీరథ్ పరారీలో ఉన్నాడని.. ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. నిజామాబాద్ నగరవ్యాప్తంగా ప్రధాన కూడళ్లలో, రోడ్ల పక్కన, గోడలపై కనిపించడంతో రాజకీయంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కేంద్ర హోంశాఖ మంత్రి కుమారుడిపైనే ఇలాంటి ఆరోపణలు రావడంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష నాయకులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారం సోషల్‌మీడియాలోనూ వైరల్ అవుతోంది. కానీ భగీరథ్‌ను అరెస్టు చేయడం పట్ల పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీనిపై ప్రజలు మండిపడుతున్నారు. సామాన్యులకు ఒక న్యాయం.. కేంద్రమంత్రి కొడుక్కి మరో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. చట్టం ముందు అందర్నీ సమానంగా చూడాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Bandi Sai Bhageerath3

Bandi Sai Bhageerath2

Bandi Sai Bhageerath1