Band Melam | టాలీవుడ్లో 2025లో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకున్న హిట్ చిత్రం ‘కోర్ట్.. స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ ద్వారా పరిచయమైన యువ జంట శ్రీదేవి – రోషన్, మరోసారి కలిసి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయడానికి సిద్ధమయ్యారు. తొలి సినిమాతోనే తమ నటనతో ఆకట్టుకున్న ఈ జంట, ఇప్పుడు రెండో సినిమాతో ప్రేక్షకులను మళ్లీ మంత్రముగ్దులను చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ నిర్మిస్తున్నారు. “బ్యాండ్ మేళం” అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదలైంది. ఇది ఎంతగానో ఆకట్టుకుంటుంది.
చేనుకాడ ఉందో జాబి మొగులాలి.. బాయికాడ ఉందో జాబిమొగులాల అనే పాటతో గ్లింప్స్ మొదలైంది. ఇక శ్రీదేవి కోసం రోషన్ రాజమ్మ అని పిలుస్తూ ఇల్లంతా వెతుకుతుంటాడు. మేడపై శ్రీదేవి పూల మొక్కల దగ్గర పూలు కోస్తుండగా, హర్ష.. రాజమ్మ రాజమ్మ అని పిలుస్తుండడంతో అలా పిలిస్తే గునపంతో గుద్దుతా అంటూ చాలా కోపంగా అంటుంది. ఇక హర్ష కొత్త ట్యూన్ రెడీ చేశా అని చెబుతాడు. యాదగిరి ఇక్కడ వాయిస్తే భువనగిరి వరకు వినిపిస్తుంది అని చెప్పడంతో గ్లింప్స్ ఎండ్ అవుతుంది. ఈ సినిమాకి చంద్రబోస్ సంగీతం అందిస్తున్నారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహిస్తున్నారు.
మొదటి బీట్ మీ అందరికి అందిస్తున్నాం. ఇది మీ హృదయానికి దగ్గర అవతుంది. మాతో కలిసి దీనిని ఎంజాయ్ చేసే వేరకు వేచి ఉండలేను అంటూ గ్లింప్స్ షేర్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చాడు హర్ష రోషన్. ఇక ఇదిలా ఉంటే కోర్ట్ మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన యువ జంట శ్రీదేవి, రోషన్ తమ తొలి చిత్రంతోనే ఎంతగానో మెప్పించారు. 2025లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని వాల్ పోస్టర్ సినిమా ద్వారా నేచురల్ స్టార్ నాని సమర్పించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి, సాయి కుమార్, శివాజీ, రోహిణి, హర్ష వర్ధన్, శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రల్లో నటించారు. ముఖ్యంగా ఈ మూవీలో వెన్నెల, చందుల కెమిస్ట్రీ యూత్ ను ఆకట్టుకుంది. ఈ మూవీలోని ‘తప్పులేదు ప్రేమలో’ అనే సాంగ్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ గా నిలిచింది.