కావలసిన పదార్థాలు అరటికాయ: ఒకటి, బియ్యం: ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము: పావుకప్పు, ఉప్పు: తగినంత, జీలకర్ర: అర టీస్పూన్, ఎండుమిర్చి: నాలుగు, నూనె: కొద్దిగా.
ముందుగా బియ్యం కడిగి నాలుగు గంటలపాటు నాన బెట్టాలి. అరటికాయను చెక్కుతీసి ముక్కలుగా కోసుకోవాలి. మిక్సీ గిన్నెలో బియ్యం, అరటికాయ ముక్కలు, కొబ్బరి తురుము, జీలకర్ర, ఉప్పు, ఎండుమిర్చి వేసి కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ రుబ్బుకోవాలి. స్టవ్‌మీద పెనం వేడయ్యాక పిండి మిశ్రమాన్ని పలుచని దోశల్లా వేసుకుని రెండు వైపులా నూనె వేస్తూ కాల్చుకుంటే కరకరలాడే ఫలహారం సిద్ధం.