నీలగిరి, అక్టోబర్ 11: నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం వద్దిపట్ల పరిధిలోని పలుగుతండాకు చెందిన రామవత్ బాలాజీ నాయక్ గ్రామం లో ఏజెంట్ల ద్వారా గిరిజన ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపి రూ. 50కోట్ల వ సూలు చేసి భూములు, కార్లు, బైక్‌లు కొని జల్సాలు చేశారు.
కొన్ని నెలలు గా అసలు, వడ్డీ ఇవ్వలేకపోయేసరికి బాధితులు బాలాజీ నాయక్‌పై ఒత్తిడి చేయడంతో పారిపోయాడు. పోలీసు లు శనివారం బాలాజీని అరెస్ట్ చేశా రు. రెండు కార్లు, ప్రామిసరీ నోట్లు, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బాధితులు తగిన పత్రాలతో గుడిపల్లి పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్రపవార్ సూచించారు.