Bala Krishna | నందమూరి బాలకృష్ణ నటుడిగానే కాదు మంచి మనసున్న మనిషిగా ఎంతో మంది మన్ననలు పొందుతూ ఉంటారు. సినిమాలతో అలరిస్తూనే వీలున్నప్పుడు పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. తాజాగా నందమూరి బాలకృష్ణ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన, తన అభిమాని బద్రిస్వామి అనారోగ్య పరిస్థితిపై స్పందించారు. కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన బద్రిస్వామి కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. వైద్యులు రూ.20 లక్షలు ఖర్చవుతుందని పేర్కొనగా, ఆర్థికంగా కష్టాల్లో ఉన్న బద్రిస్వామికి చికిత్స చేయించుకోవడం కష్టంగా మారింది. ఈ విషయాన్ని ఆదోని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సజ్జాదాస్సేన్ బాలయ్య దృష్టికి తీసుకువెళ్లారు.
వెంటనే స్పందించిన బాలయ్య, రాష్ట్ర ప్రభుత్వ సహాయంగా రూ.10 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించారు. ఈ సహాయాన్ని బాలకృష్ణ సతీమణి వసుంధర స్వయంగా బద్రిస్వామికి అందజేశారు.బాలయ్య చేసిన సాయం పట్ల సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. గతంలో కూడా బాలయ్య తన అభిమానులకి అనేక సందర్భాలలో సాయం చేసిన విషయం తెలిసిందే. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ–2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. దసరా పండుగకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇక బాలయ్య ఆదిత్య 999 అనే సినిమాతోను పలకరించనున్నాడు. ఈ చిత్ర దర్శకుడెవరో కాదు. బాలకృష్ణ వందవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని అద్భుత విజయంగా మలిచిన క్రిష్ జాగర్లమూడే. త్వరలోనే క్రిష్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించనున్నారు. ఆ తర్వాత మలినేని గోపీచంద్ తో సినిమా చేయనున్నారు.. ఈ సినిమాతో పాటే ‘ఆదిత్య 999’ని కూడా సమాంతరంగా చేసేందుకు బాలయ్య నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మరో విశేషం ఏంటంటే.. ‘ఆదిత్య 999’తోనే తన నట వారసుడు మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయనున్నారటబాలకృష్ణ. దీనికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి.