న్యూఢిల్లీ, మార్చి 2 : బజాజ్ ఆటో గత నెల విక్రయాలు ఏడాది ప్రాతిపదికన 16 శాతం తగ్గి 3,16,020 యూనిట్లకు పడిపోయాయి. ఏడాది క్రితం ఇదే నెలలో సంస్థ 3,75,017 యూనిట్ల వాహన విక్రయాలు జరిపింది. గత నెల విక్రయించిన మొత్తం వాహనాల్లో దేశీయ విక్రయాలు 32 శాతం తగ్గి 1,12,747లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఇది 1,64,811గా ఉన్నది.