న్యూఢిల్లీ, నవంబర్ 7 : బజాజ్ ఆటో ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 53 శాతం ఎగబాకి రూ.2,122 కోట్లకు చేరుకున్నది.
కంపెనీ వాహన అమ్మకాలు భారీగా పుంజుకోవడం, ఎగుమతులు పెరగడం కలిసొచ్చింది. కంపెనీ ఆదాయం రూ.13,247 కోట్ల నుంచి రూ.15,735 కోట్లకు ఎగబాకింది.