లండన్: 2030 నాటికి అంగారక గ్రహంమీదకు మానవులను పంపాలని నాసా ప్రయోగాలను ముమ్మరం చేస్తున్నది. భూమికి సుమారు 5.4 కోట్ల కిలోమీటర్ల సుదూరాన ఉన్న ఆ గ్రహం మీదకు మనుషులను పంపించి, తిరిగి తీసుకురావాలంటే కనీసం 30 టన్నుల మీథేన్, ద్రవరూప ఆక్సిజన్ అవసరమవుతుంది. మొత్తంగా రూ.60 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో జార్జియాకు చెందిన పరిశోధకులు ఓ చక్కని ఉపాయాన్ని కనిపెట్టారు. అంగారకుడిపై ఫొటోబయోరియాక్టర్లను ఏర్పాటు చేసి.. సూర్యరశ్మి, కార్బన్‌డైఆక్సైడ్ సాయంతో సైనోబ్యాక్టీరియాను సృష్టించవచ్చని తెలిపారు. దాని సాయంతో చక్కెర అణువులను తయారుచేసి, రాకెట్ ఇంధనాన్ని ఉత్పత్తి చేయవచ్చని అభిప్రాయపడ్డారు. దీంతో మార్స్‌పైనే ఇంధనాన్ని నింపుకోవచ్చన్నారు.