Baby Movie | ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ జంటగా నటించిన చిత్రం ‘బేబీ’. హృదయ కాలేయం ఫేమ్ సాయిరాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్.కె.ఎన్. నిర్మించారు. జూలై 14న విడుదలైన ఈ చిత్రం రూ.70 కోట్ల మార్కును దాటేసి రికార్డ్ స్థాయిలో దూసుకెళుతుంది. కాగా ఈ చిత్రం నుంచి ఓ సాలిడ్ అప్డేట్ను డైరెక్టర్ సాయిరాజేష్ ప్రకటించారు.
ఈ మూవీ ఆల్బమ్ లోని ఆరు పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి ఏడవ పాటని విడుదల చేస్తున్నట్లు డైరెక్టర్ సాయిరాజేష్ ప్రకటించారు. ‘చందమామ’ టైటిల్‌తో ఈ సాంగ్ ఉంటుందని.. ప్రముఖ సింగర్ దీపు పాడినట్లుగా సాయిరాజేష్ తెలిపారు. అయితే ఈ పాట ఎప్పుడు విడుదల చేస్తామనేది మాత్రం సాయిరాజేష్ వెల్లడించలేదు. కాగా ‘చందమామ’ సాంగ్ కోసం బేబి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
బేబీ వచ్చి రెండు వారాలు దాటినా ఇంకా అదే మత్తులో యూత్ ఊగిపోతున్నారు. కల్ట్ బొమ్మ అంటూ రివ్వూలు ఇచ్చేస్తున్నారు. ఓ వైపు జోరుగా వానలు పడుతున్నా.. మరో వైపు బేబితో హాల్స్ నిండుగా కనిపిస్తున్నాయి.
#BabyTheMovie
7th song loading ♥️
Singer Deepu ♥️#Chandamama pic.twitter.com/kuMwDEGbBp— Sai Rajesh (@sairazesh) July 27, 2023