లాహోర్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ వన్డేలో పాకిస్థాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. లాహోర్లో జరిగిన మ్యాచ్లో 349 పరుగుల టార్గెట్ను పాక్ చేజ్ చేసింది. దీంతో సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 32 ఏళ్ల క్రితం ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్గా ఆస్ట్రేలియాపై అత్యధికంగా 82 రన్స్ చేశాడు. అయితే గురువారం నాటి మ్యాచ్లో ఆ రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు. ఆస్ట్రేలియాపై వన్డేల్లో అత్యధిక రన్స్ చేసిన పాక్ కెప్టెన్గా బాబర్ నిలిచాడు. ఈ మ్యాచ్లో బాబర్ ఆజమ్ 114 రన్స్ చేయగా, ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ 106 రన్స్ చేశాడు. పాక్ ఓపెనర్లు ఇమామ్, ఫకర్ జమాన్లు తొలి వికెట్కు 118 రన్స్ జోడించారు. ఆ తర్వాత బాబర్ రాకతో పాక్ స్కోరింగ్ వేగం మరింత పెరిగింది. పాక్ ప్లేయర్ కుష్దిల్ షా 12 బంతుల్లో 27 రన్స్ చేసి విక్టరీలో కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో బెన్ మెక్డార్మెట్ 104, ట్రావిస్ హెడ్ 89, లబూషేన్ 59 రన్స్ చేశారు. తొలి వన్డేలో ఆస్ట్రేలియా 88 రన్స్ తేడాతో విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే.