శామీర్‌పేట, జూలై 19 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉమ్మడి శామీర్‌పేట మండలంలో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తూంకుంట మున్సిపల్ పరిధిలోని శామీర్‌పేట, బాబాగూడ ప్రాంతాల్లో కమిషనర్ ఎంఎన్ఆర్ జ్యోతి పర్యటించి సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా పచ్చదనం, పరిశుభ్రత, తడి, పొడి చెత్తల నిర్వాహణపై అవగాహన కల్పించారు.
అదే విధంగా అలియాబాద్ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ అలియాబాద్ ఎస్సీ కాలనీలో తడి పొడి చెత్త నిర్వాహణ, పరిసరాల పరిశుభ్రత, మూడుచింతలపల్లి మున్సిపల్ కమిషనర్ పవన్‌కుమార్ మున్సిపల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు పచ్చదనం, పరిశుభ్రత, అండర్గ్రౌండ్ల నిర్వాహణ, చెత్తను ఎరువుగా తయారు చేయడం ప్లాస్టిక్ నిషేదంపై వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, పద్మ, భాస్కర్, ఉషా, తదితరులు పాల్గొన్నారు.